స్వచ్ఛ ఆంధ్ర క్లాప్ ఆటోలను కొనసాగించాలి డ్రైవర్లకు పని భద్రత కల్పించాలి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె కాలపు ఒప్పంద జీవోలను అమలు చేయాలని, క్లాప్ ఆటోలను కొనసాగించి క్యాబ్ డ్రైవర్లకు పని భద్రత కల్పించాలని, ఆంధ్ర క్లాప్ డ్రైవర్ల 7నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము ముందు సిఐటియు నగర క్లాప్ డ్రైవర్ల కార్యదర్శి రఘుశేఖర్ అధ్యక్షతన ధర్నా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, సిఐటియు ఓల్డ్ సిటీ నగర కార్యదర్శి మారెళ్ళ విజయ రామాంజనేయులు, నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ ఉపాధ్యక్షులు మైముద్, ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు కుమార్ పాల్గొని మాట్లాడుతూ కర్నూలు నగర పరిధిలో పనిచేసే క్లాప్ డ్రైవర్లకు 7 నెలలుగా పెండింగ్లో జీతాలు ఉండటం వలన కార్మికుల కుటుంబాల గడవగా చాలా అవస్థలు పడుతున్నారని తెలిపారు, కర్నూలు నగరంలో ఉండే 52 వార్డులు చెత్త లేని నగరంగా పరిశుభ్రంగా ఉన్నాయంటే క్లాప్ డ్రైవర్ల కష్ట ఫలితమేనని గుర్తు చేశారు, గత వైసిపి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో ఆటోలకు డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసుకుని అగ్రిమెంట్ ప్రకారం రూ :-18500 జీతం ఈఎస్ఐ, పిఎఫ్, కార్మిక చట్టాల అమలు చేస్తామని చెప్పి బినామీ ఏజెన్సీ లతో కార్మికుల కడుపు కొట్టారని విమర్శించారు, గతంలో కార్మికుల పోరాటం వలన కమిషనర్ జోక్యం చేసుకొని కొంత పెండింగ్ జీతాలు ఇచ్చి ఇప్పటినుండి జీతాల బాధ్యత నాదేనని ఒప్పుకుని పని చేయించుకుని కార్మికులను మోసం చేశారని తెలిపారు, సమ్మె కాలంలో కార్మికుల పోరాటాలకు మద్దతుగా నిలబడిన తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం వచ్చే 8నెలలు కార్మికుల సమస్యల పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు, ఈ ప్రభుత్వం ప్రజల పైన భారాలు వేయకుండా చెత్త పనులను రద్దు చేయడం మంచి పరిణామయిన క్లాప్ ఆటోలకు విధి విధానాల అమలు చేయకపోవడం, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు క్లాప్ ఆటోలను తీసేసి కాంట్రాక్టు పద్ధతిలో మా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుంటామని బహిరంగ ప్రచారం చేస్తున్నారని తెలిపారు, క్లాప్ ఆటో లను తొలగిస్తామంటే ఓట్లు వేసినా కార్మిక కుటుంబాలకు పోషణ ఎలా జరుగుతుందని మాత్రం ఆలోచన చేయడం లేదని బాధ వ్యక్తం చేశారు,గత ప్రభుత్వం కార్మికులను మోసం చేసినందుకే ఇంటికి పంపించారని ఈ ప్రభుత్వమైనా చొరువ తీసుకొని కార్మికుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు పెండింగ్ జీతాలు ఇప్పించి, అగ్రిమెంట్ ప్రకారం 24 వేల రూపాయల జీతాన్ని ఇప్పించి, ఈఎస్ఐ,పిఎఫ్, వీక్లీ ఆఫ్ లు అమలు చేసి పని భద్రత కల్పించి కార్మికుల పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు,లేని పక్షాన కార్మికులకు న్యాయం జరిగేంత వరకు సిఐటియు పోరాటం చేస్తుందని హెచ్చరించారు, ధర్నా కార్యక్రమం ముగిసిన తరువాత కార్మిక శాఖ అధికారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో క్లాప్ డ్రైవర్ లందరూ పాల్గొన్నారు.