బీరప్ప స్వామి నిర్మాణానికి కృషి చేస్తా మంత్రి సవితమ్మ

బీరప్ప స్వామి నిర్మాణానికి కృషి చేస్తా మంత్రి సవితమ్మ

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు లో నిర్మాణంలో ఉన్న బీరప్ప స్వామి దేవాలయాన్ని రాష్ట్ర మంత్రి సవితమ్మ సందర్శించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి వచ్చిన మంత్రి ఆలయ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. దేవాలయ నిర్మాణానికి పదిలక్షల రూపాయలు ఆర్థిక సహయం ప్రకటించిన ఎంపీ నాగరాజు వచ్చే కార్తీక మాసం లోపు ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఈసందర్భంగా
దేవాలయానికి స్థలం ఇచ్చిన దాత పాల సుంకన్న ను మంత్రి ఈసందర్భంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో కురువ సంఘం
జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు. ప్రధాన కార్యదర్శి రంగస్వామి, పాల సుంకన్న,ధనుంజయ,వెంకటేశ్వర్లు, కేసీ. నాగన్న, మహిళా సంఘం నాయకురాలు టీ. శ్రీలీల, అనిత తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!