చెన్నంపల్లి గ్రామంలో గోకులం షెడ్డు ప్రారంభం

చెన్నంపల్లి గ్రామంలో గోకులం షెడ్డు ప్రారంభం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో పత్తికొండ శాసన సభ్యులు కె.యి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు చెన్నంపల్లి గ్రామ టిడిపి నాయకులు మా బాషా,రాజేంద్ర గౌడ్,కోటేష్ గౌడ్,అక్బర్ బాషా ఆద్వర్యంలో ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు,మండల టిడిపి కన్వీనర్ ఆర్ తిరుపాలు నాయుడు, తిమ్మయ్య చౌదరి,మనోహర్ చౌదరి, రాతన మైరాముడు,తుగ్గలి మండల ఎపీఓ హేమ సుందర్ లు చెన్నంపల్లి గ్రామ రైతు ఎద్దులదొడ్డి మల్లికార్జున ఉపాధి హామీ గ్రామీణ పథకంలో భాగంగా నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు.అదేవిధంగా ఎర్రగుడి గ్రామం నందు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు,టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్, టిడిపి నాయకులు వెంకటస్వామి, చంద్రశేఖర్ యాదవ్,ఏపీఓ హేమ సుందర్ లు గోకులం షెడ్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చెన్నంపల్లి గ్రామ టిడిపి సీనియర్ నాయకులు మా బాషా,అక్బర్, రామయ్య, హనుమంతు రెడ్డి,జయ రాముడు, మండల టిడిపి ఉపాధ్యక్షులు వెంకట రాముడు చౌదరి,ఫీల్డ్ అసిస్టెంట్ దేవేంద్ర, రంగ స్వామి,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!