క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి
మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్ వెలుగు; చిన్నతనం నుంచి క్రీడలు ఆడితే మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక దుడత్వం వస్తుందని దీంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగర శివారులో ఉన్న రిడ్జ్ స్కూల్ నందు మూడు రోజులపాటు జరిగిన 16వ జూనియర్ రోల్ బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడా పోటీలకు కర్నూలు వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. తాను కూడా ఫుట్బాల్ అసోసియేషన్, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నో ఏళ్ల పాటు పని చేసి, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ లను నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని ఏదో ఒక క్రీడలో రాణించినట్లయితే మంచి భవిష్యత్తుతో పాటు మంచి గుర్తింపు కూడా లభిస్తుందని టీజీ అన్నారు. క్రీడారంగంలో ప్రతిభ కనబరిచి, రాణించిన వారికి ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. రోల్ బాల్ క్రీడా అభివృద్ధికి రోల్ బాల్ క్రీడా ఫౌండర్ రాజు అలాగే రోల్ బాల్ క్రీడా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రమౌళి ఎంతగానో కృషి చేస్తున్నారని టీజీ వెంకటేష్ ఈ సందర్భంగా అభినందించారు. జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించిన ఘనత రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్యకే దక్కుతుందని టీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, మోహన్, మురళీధర్ రెడ్డి, సునీల్, అవిలిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.