పల్లె దారులకు కొత్త కళ

పల్లె దారులకు కొత్త కళ

 వేగవంతంగా సాగుతున్న హొన్నూరు క్యాంప్ 

  హోళగుంద ఎలెల్సి కెనాల్ వరకు బీటీ రోడ్డు పనులు

హోళగుంద, న్యూస్ వెలుగు: గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రహదారుల నిర్మాణం నిర్వహణపై కూటమి

ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పల్లెలకు పూర్వ వైభవం తెచ్చేందుకు పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించింది.ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యాన్ని నోచుకోని గ్రామాల రూపురేఖలని మార్చేస్తూ గ్రామాల్లో సంక్రాంతికి ముందే అసలైన పండుగ తెచ్చింది.బిటి రోడ్డు హొన్నూరు క్యాంప్ గ్రామానికి నూతన శోభ సంతరించుకుంది.
గత ఐదేళ్లు నిధులు లేకపోవడంతో అభివృద్ధికి అమడూ దూరంలో ఉన్న గ్రామాలకు కూటమి ప్రభుత్వం రాకతో కొత్త కళ వచ్చింది సంక్రాంతి పండుగ వేళ పల్లెలు మౌలిక వసతులతో ముస్తాబైయ్యాయి.ప్రధానంగా దశాబ్దాలుగా రోడ్డును చూడని హొన్నూరు క్యాంప్ గ్రామానికి పల్లే పండుగ నిధుల కింద రూ.4 కోట్ల 70 లక్షల నిధులతో బీటీ రోడ్లు మంజూరు చేసింది.దీంతో సుగుణ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు శరవేగంగా పనులు చేపడుతున్నారు.ఈ సందర్భంగా కాంట్రాక్టర్ రఘురామి రెడ్డి,పిఆర్ఏఈ యమునప్ప మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ, రైతులకు,వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో బసవరాజ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!