పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ

పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ

Puttaparthi (పుట్టపర్తి) : పోలీస్ శాఖ అంటే ఎంతో క్రమశిక్షణకు మారుపేరని అటువంటి పోలీస్ శాఖలో  విధి నిర్వహణలో అందించిన సేవలు మరవలేనివని  జిల్లా ఎస్పీ వి.రత్న పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడరు . శుక్రవారం పదవి విరమణ పొందిన పోలీసు అధికారులను సన్మానించారు. వివిద హోదాల్లో పనిచేసిన ఏఆర్ సుంకన్న, ఏఎస్ ఐ నీలకంఠ, ఏఆర్ ,ఏఎస్ఐ నరసింహులు, ఏఎస్ఐ లను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఎన్ విష్ణు, ఏఆర్, డిఎస్పి జెడ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ వి.రత్న  శాలువతో  సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.  పదవివిరణ తర్వాత కుటుంబంతో సంతోషంగా గడపాలన్నారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్ విష్ణు,ఏఆర్ ,డిఎస్పి విజయ్ కుమార్,ఏవో సుజాత, సూపర్డెంట్ సరస్వతి, ఆర్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!