కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కర్నూల్ బి. క్యాంపు నందు గల మన

వృద్ధుల పిల్లల ఆశ్రమం ఎం.ఎన్. రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ, బి.క్యాంప్, కర్నూలు నందు అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి మాట్టాడుతు వీరికి కావలసిన ఉచిత న్యాయ సహాయం కొరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు అని తెలిపారు.వయో వృద్దులకు ప్రభుత్వం తరుపున నెలకు పెన్షన్ రూ.4,000/- ఇవ్వబడుతుందని తెలిపారు . లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15000 ద్వారా ఏమైనా సమస్య లుంటే తమ సంస్థ కు తెలుపగలరు అని తెలిపారు.వయో వృద్ధుల సంక్షేమ పధకాల గురించి వివరించారు. వృద్ధుల సహాయర్థం లాయర్ నుండి ఒకరిని మరియు యన్. జి. ఓ. నుండి ఒకరిని సీనియర్ సిటిజెన్ డిపార్ట్మెంట్ నుండి ఒకరిని నియమించారు.ఈ సదస్సు లో డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు ఎన్. జి. ఓ,న్యాయ వాది పాపారావు, మన వృద్ధ ఆశ్రమం నిర్వాహకులు ఇస్మాయిల్ మరియు వృద్ధులు పాల్గొన్నారు.
Thanks for your feedback!