
టీడీపీ నాయకుడు జయరాం చౌదరి అనారోగ్యంతో మృతి
నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని రాతన గ్రామంలో అనారోగ్యంతో టీడీపీ నాయకుడు పథకమూరి జయరాం చౌదరి గురువారం రోజున మృతి చెందాడు.ఈయన మృతి పట్ల పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.తుగ్గలి మండల టీడీపీ అధ్యక్షులు రాంపల్లి తిరుపాల్ నాయుడు,మండల ఉపాధ్యక్షులు రాంపురం కొట్టాల వెంకటరాముడు చౌదరి,మనోహర్ చౌదరి,పెరవలి పురుషోత్తం చౌదరి లు మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu