విదేశీ పర్యటన చేయనున్న రాష్ట్రపతి
Delhi (ఢిల్లీ ): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 5 నుంచి 10వ వరకు ఫిజీ, న్యూజిలాండ్ మరియు తైమూర్-లెస్టేలో మూడు దేశాల పర్యటనచేయనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయ అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి సెక్రటరీ (తూర్పు) జైదీప్ మజుందార్ మాట్లాడుతూ, ఫిజీ మరియు తైమూర్ లెస్టేలను భారత రాష్ట్రపతి సందర్శించడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. భారతదేశం ఫిజీతో 75 సంవత్సరాల దౌత్యపరమైన ఉనికిని పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పర్యటన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ముర్ము , ఫిజీ అధ్యక్షుడు కటోనివేరే మరియు ప్రధాన మంత్రి సితివేని రబుకాతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!