
సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు
తుగ్గలి/పత్తికొండ న్యూస్ వెలుగు ప్రతినిధి: ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు లబ్ధిదారులకు అందజేశారు.శుక్రవారం రోజున పత్తికొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు తుగ్గలి మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామానికి చెందిన సంఘాల ఆనందమ్మ కు 30,700 రూపాయల చెక్కును,రాంపల్లి గ్రామానికి చెందిన అంగడి సుభాష్ చంద్రబోస్ కు 30,200 రూపాయల చెక్కును పత్తికొండ ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. పత్తికొండ నియోజకవర్గం వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన 3,80,000 రూపాయలను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,ఉపాధ్యక్షుడు వెంకట రాముడు చౌదరి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు సంఘాల కృష్ణ,లక్ష్మణ స్వామి,మాజీ ఎంపిటిసి వల్లె వెంకటేష్, కిష్టయ్య,గిరిగెట్ల తిమ్మయ్య చౌదరి, తెలుగు యువత మండల అధ్యక్షుడు సత్య ప్రకాష్,శభాష్ పురం మోహన్ తదితర మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.