
ఫిబ్రవరి 7,8న అంతరాష్ట్రీయ కబడ్డీ పోటీలు
హోళగుంద, న్యూస్ వెలుగు: శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 7,8 న మండల కేంద్రంలో అంతరాష్ట్రీయ కబ్బడి పోటీలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం నిర్వాహకులు పాత్రికేయులకు తెలిపారు.ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ జట్టు పేరును ఫిబ్రవరి 7 ఉదయం:- 8:00 గంటల లోపు రూ.1000/- చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు.ఇందులో మొదటి బహుమతిగా వీరన్న గౌడ,తిక్క స్వామి,పవన్ రూ.30000/-,రెండవ బహుమతిగా బాగోడీ రామ,పెద్దహ్యాట మల్లయ్య రూ.20000/-,మూడవ బహుమతిగా రూ.10000/- హోళగుంద స్పోర్ట్స్ కమిటీ వారు అందించనున్నట్లు తెలియజేశారు.అంతేకాకుండా జట్టు పేరు నమోదు కొరకు-8309534550,8897791381,7899966226,8142546439 ను సంప్రదించాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!