
హిందూపూర్ జిల్లా గా ప్రకటించండి; కొత్తూరు సత్యం
కర్నూలు, న్యూస్ వెలుగు; హిందూపూర్ జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాయలసీమ రాష్ట్ర ఉద్యమ నాయకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ దత్తపుత్రుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం , ఆయన పలుకు ఒక సంచలనం, ఆయన మాట ఓ తూటా, ఆయన సందేశం ఒక స్ఫూర్తి ,అలాంటి నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎన్టీఆర్ను హిందూపూర్ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని ఆయన వంశీయులను నేటికీ గెలిపిస్తూ ఉన్నారని ఆయన తెలిపారు. అటువంటి నియోజకవర్గం ఎందుకు జిల్లాగా ప్రకటించడం లేదని ఆయన ప్రశ్నించారు. విప్లవాత్మక మార్పులు చూపించారని, తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే దారిని ఆయన పాలనలో ఏనాడు చూడలేదు అన్నారు .రాయలసీమ ప్రాంతంలో కరువును దృష్టిలో పెట్టుకుని అనేక ప్రాజెక్టులను చేపట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అటువంటి మహానీయుడు ఎన్టీఆర్ ను అభిమానించే హిందూపూర్ ను వెంటనే ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని ప్రస్తుతమున్న 8 జిల్లాలతో పాటు హిందూపూర్ తో కలిపితే తొమ్మిది జిల్లాలు ఏర్పాటు అయితే రాయలసీమ నిజంగా రతనాలసీమగా మారుతుంది అన్నారు. ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం లో ఉన్న అనేక కుటుంబాలు వలస బాట పట్టడం బాధాకర విషయం అన్నారు. ఈనాటికి గుంటూరు ,కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాలలో బతుకుతెరువు కోసం వెళ్తున్నారని వీరితో పాటు వారి సంతతి కూడా వలస బాట పట్టడం వల్ల చదువుకు దూరంగా ఉండిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని వలసల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar