
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేడితరం చిన్నారులకు నేర్పించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నేటితరం చిన్నారులకు నేర్పించాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆదివారం నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ, గురువాసవి శేషగిరిశెట్టి ఆధ్వర్యంలో 108మంది కన్యకలతో కలశ యాత్ర నిర్వహించారు. ఈ కలశయాత్రలో టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27ఏళ్లుగా వాసవి మాత దీక్షమాలను ధరిస్తూ అమ్మవారి కృపకు పాత్రులు అవుతారన్నారు. అనంతరం కలశ యాత్ర రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభమై పూలబజారులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్దకు చేరుకుంది. అనంతరం ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకాలతో కలశ జలాలతో అభిషేకించారు. భక్తులకు తీర్థవసాదాలను అందజేశారు. సాయంత్రం ప్రత్యేక దీపాలంకరణ, మంగళహారతి నిర్వహించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar