
దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన అమిత్ షా
మంత్రి పదవికి రాజీనామా చేయాలి
కాంగ్రెస్ భారీ పాదయాత్ర
రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్
కర్నూలు, న్యూస్ వెలుగు; కేంద్రమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అంబటి రామకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ గారిని జపించే బదులు, భగవంతుని జపిస్తే మోక్షం లభిస్తుందని అంబేద్కర్ ని అవమానపరిచారని అమిత్ షా గారి ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని ఉద్దేశంగా ఉందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల హక్కులను కాలరాయాలను చూస్తున్నారని రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ గారిని అలాంటి మహనీయుని అవమానించిన అమీషా ప్రధాని నరేంద్ర మోడీ బర్తరఫ్ చేయకుండా ఇంతకాలం చూస్తూ ఊరుకుంటున్నారని అమిత్ షా గారి మాటలు అతని దురహంకారానికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రామకృష్ణ తెలియజేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీ కృష్ణ గారు మాట్లాడుతూ హోమ్ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని లేకుంటే ప్రధాని మోదీ మంత్రి పదవి నుండి అమీషా గారిని బర్తరప్ చేయాలని, కూటమి నాయకులు అధికారంలో ఉన్నారంటే ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజ్యాంగం వల్లనే పదవులు వచ్చాయి తప్ప స్వతహాగా చేసింది ఏమీ లేదని అంబేద్కర్ అవమానిస్తే యావత్ దేశ ప్రజలను అవమానించినట్లేనని మీ మాటలు వెనక్కి తీసుకొని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. అమిత్ షాచేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతను వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని కోరుచూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి YS షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై అమిత్ షా డౌన్ డౌన్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి అని నినాదాలు చేస్తూ నెహ్రూ రోడ్, చౌక్ బజార్, గడియారం హాస్పిటల్, పెద్ద మార్కెట్ మీదుగా పాత బస్టాండు వద్దగల అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరము ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఎమ్మిగనూరు ఎం ఖాసిం వలి, ఆలూరు చిప్పగిరి లక్ష్మీనారాయణ, ఆదోని జి రమేష్ యాదవ్, పత్తికొండ బి క్రాంతి నాయుడు, మంత్రాలయం పి మురళీకృష్ణమరాజు జిల్లా ఓబీసీ చైర్మన్ డివి సాంబశివుడు ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు బి బతుకన్న, ఎన్ సుంకన్న, కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఎస్ ప్రమీల కాంగ్రెస్ నాయకులు ఎన్ సి బజారన్న ఎజాస్ అహ్మద్, బి సుబ్రహ్మణ్యం, ఈ లాజరస్, షేక్ ఖాజా హుస్సేన్, అనంతరత్నం మాదిగ వై మారుతి రావు రాఘవేంద్ర రెడ్డి రియాజుద్దీన్ షాహిద్ అహ్మద్, షేక్ అక్బర్, రమేష్, అమన్, డబ్ల్యూ సత్తిరాజు నవీద్, అబ్దుల్ హై షేక్ మాలిక్ రవి తుగ్గలి రవి కుమార్, జాన్ సదానందం వసి బాషా, మిన్నెలా, వసీం మహిళా కాంగ్రెస్ పుష్ప మల్లేశ్వరి శ్రీలత అధిక సంఖ్యలో ప్రజలు మహిళలు పాల్గొన్నారు.