జాతీయ బాలికల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం

జాతీయ బాలికల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం

    కేజీబీవీ పాఠశాల నందు జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు

మద్ధికేర న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి,డాక్టర్ రాగిణి లా ఆదేశానుసారం మండల కేంద్రంలో గల శుక్రవారం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ భాష జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలని,ఆడపిల్లల పట్ల వివక్ష చూపరాదని తెలిపారు.అనంతరం సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు,ఆరోగ్యం,విద్య,సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కలిగించారు.ఆడపిల్లల బ్రూణ హత్యలు,లింగ అసమానతలు, లైంగిక వేధింపులు,లింగ వివక్షతను విడనాడాలని,సేవ్ ది గర్ల్ చైల్డ్,భేటీ బచావో బేటి పడావో,ఆడపిల్లలకు ఉచిత విద్య,వైద్యం పలు రిజర్వేషన్లు ప్రభుత్వం బాలికలకు కలిగిస్తుందని, వివాహ వయస్సు,బాల్య వివాహాల నిర్మూలన,గుడ్ టచ్ బ్యాడ్ టచ్, వ్యక్తిగత పరిశుభ్రత,గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంపై విద్యార్థినులకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా,కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రిన్సిపల్ జ్యోతి రెడ్డి,ఆరోగ్య కార్యకర్త అనార్కలి,హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ హెల్త్ ప్రొవైడర్ అంజలి,సచివాలయం హెల్త్ సెక్రటరీ సువర్ణ ,ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది,టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!