
జాతీయ క్రీడలకు జిల్లా క్రీడాకారులు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఈనెల 28 నుంచి ఫిబ్రవరి వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే 38వ జాతీయ బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు కార్యదర్శి రుద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో జాతీయ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు. న్యాయవాది శ్రీధర్ రెడ్డిలు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి జాతీయ క్రీడలకు ఎంపిక కావడం శుభపరిణామం అన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar