
ఓటు చాలా విలువైనది… తహసిల్దార్ రమాదేవి
విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని రెవెన్యూ శాఖ అధికారులు విద్యార్థుల ద్వారా ఓటు హక్కు పై శనివారం రోజున అవగాహన ర్యాలీను నిర్వహించారు. తుగ్గలి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ప్రధాన రహదారిపై విద్యార్థులతో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం ఆదోని- గుత్తి ప్రధాన కూడలి వద్ద అధికారుల ద్వారా మరియు ప్రజల ద్వారా ఓటర్ల ప్రతిజ్ఞలను నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రమాదేవి మాట్లాడుతూ ఓటు హక్కు చాలా విలువైనదని,ఓటు హక్కు ద్వారా దేశ భవిష్యత్తును మార్చవచ్చని ఆమె తెలియజేశారు.18 సంవత్సరాలు పైబడిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకొని,ఓటు హక్కును పొందాలని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగరాజు,తుగ్గలి జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బాబు రావు, వీఆర్వోలు కాశీ రంగస్వామి,నవీద్ పటేల్,తిమ్మయ్య,స్వరూప్,ఫిజికల్ డైరెక్టర్ చందు నాయక్,కంప్యూటర్ ఆపరేటర్ వినోద్,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu