ఉపాధ్యాయుడా….. మజాకా.

ఉపాధ్యాయుడా….. మజాకా.

మద్యం సేవించి విధుల్లోకి ఉపాధ్యాయుడు.
తాగిన మత్తులో విద్యార్థులను చితక బాదిన వైనం.
  ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు.
హోళగుంద,న్యూస్ వెలుగు: గురువు అంటే దైవ సమానం….సమాజ నిర్మాత అని కొలుస్తారు అయితే ఇలాంటి పవిత్రమైన స్థానంలో ఉండి ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరు కావడమే కాకుండా తాగిన మైకంలో విద్యార్థులను పైప్ తో చితక బాదాడు…..వివరాలోకెళ్తే మండల పరిధిలోని ముద్దటమాగి గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు జయరాజు అనే ఉపాధ్యాయుడు ప్రతి రోజు మద్యం సేవించే వాడు ముఖ్యంగా పిల్లి కుండలో పాలు త్రాగ్యనులే ఎవరు చూడలేదులే అనే సామెతానికి అనుగుణంగా ఉపాధ్యాయుడు రోజు పాఠశాల బాత్ రూమ్ లో వెళ్ళి మద్యం సేవించి వచ్చే వారు….అయితే సోమవారం ఉపాధ్యాయుడు మద్యం సేవించే దృశ్యాలు మద్యం సీసం పట్టుకున్న విద్యార్థుల గమనించారు.దీంతో ఉపాధ్యాయుడు కోపంతో త్రాగిన మైకంలో విద్యార్థులను పైప్ తో చితక బాధీ గాయాలకు గురిచేశాడు.వెంటనే విద్యార్థులు బాలాజీ,లావణ్య తదితరులు విషయాని తల్లిదండ్రులకు తెలపడంతో తల్లితండ్రులు పాఠశాలలకు చేరుకుని సదరు ఉపాధ్యాయుడి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం విద్యార్థుల తల్లితండ్రులు మాట్లాడుతూ ఇలాంటి తాగుబోతు ఉపాధ్యాయుడు మాకు వద్దని పాఠశాలకు తాళం వేసి విద్యార్థులను ఇళ్లకు పంపించారు.విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి ఊటాఉటిన ముద్దటమాగి గ్రామానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో సమస్యను తెలుసుకున్నారు.అదేవిధంగా ఉపాధ్యాయుడిని వీధుల నుంచి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు గంగాధర్,శేషన్న,తిమ్మ రెడ్డి, మైలారి,కాళింగ,రామన్న,శ్రీనివాసులు తదితరులు వినంతి పత్రం సమర్పించారు.
*మండల విద్యాశాఖాధికారి జగన్నాథ్ ను వివరణ కోరగా.
ఉన్నతాధికారులు సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారని మరియు రేపటి నుంచి పాఠశాలకు వేరే ఉపాధ్యాయుడిని పంపడం జరుగుతుందన్నారు.తల్లితండ్రులు విద్యార్థులను యధావిధిగా పాఠశాలకు పంపాలని తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!