
విద్యుత్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2022 నుండి పి.ఆర్.సి. అమలు చేయాలి
ఎం.డి. అంజిబాబు, సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి,
కర్నూలు, న్యూస్ వెలుగు; యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం విద్యుత్ శాఖ కర్నూలు జిల్లా సూపర్ఇంటెండింగ్ ఇంజనీర్, ఎం. ఉమాపతి కి కలసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎస్.ఇ. ఛాంబర్ నందు ఇవ్వడం జరిగిందనీ, సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు, ఎం.డి. అంజిబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి, జే. నాగేశ్వరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు), ఎస్పీడీసీఎల్ కంపెనీ కమిటీ, ఉపాధ్యక్షులు, పి. నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు అందరికీ 2022 సంవత్సరం సంబంధించిన, పి. ఆర్. సి. అమలు చేసి పెండింగ్ లో ఉన్న ఏరియార్స్ తక్షణమే చెల్లించాలని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలి. 2018 సంవత్సరం నుండి నియమించిన కార్మికులందరికీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి. ప్రతి కార్మికునికి అన్ లిమిటెడ్ హెల్త్ కార్డు ఇవ్వాలి. జిల్లా స్టోర్స్ నందు పని చేస్తున్న లోడింగ్, అన్ లోడింగ్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్.ఎస్.ఆర్, రేట్లు పెంచి అమలు చేయాలి. పీస్ రేట్ కార్మికులైన మీటర్ రీడర్స్, ఎస్. పి. ఎం. కార్మికులకు, బిల్ కలెక్టర్, లకు కనీస వేతనం అమలు చేయాలి. కాంటాక్ట్ కార్మికులను వారి వారి అర్హతను బట్టి రెగ్యులరేషన్ చేసి, ప్రమోషన్ ఇవ్వాలి. ఈలాంటి అనేక సమస్యలన్నీ పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిందని వాటిని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సి. చలపతి, సూర్యనారాయణ, మోహన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.