
విద్యార్థినీలకు రక్షణ కల్పించలేని ఎస్ ఆర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
ఎస్ఎఫ్ఐ, ఐద్వా, ఏఐఎస్ఎఫ్
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ నగర శివారులో ఉన్న ఎస్ఆర్ కళాశాలలో విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఎస్ఎఫ్ఐ ఐద్వా ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీలు గా ఆర్ఐఓ గురువయ్య శెట్టికి వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణ, అలివేలమ్మ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న మాట్లాడుతూ ఎస్ఆర్ కళాశాలలో ఆదివారం రాత్రి ఒక విద్యార్థినికి చేతికి కత్తితో పొడిచి జుట్టు కత్తిరించి క్షుద్రపూజలు చేసి విద్యార్థిని ఫోటో పై నిన్ను చంపుతామని రాశారనీ అన్నారు. విద్యార్థి తనకు జరిగిన సంఘటనను యాజమాన్యం దృష్టికి తీసుకొని వస్తె విచారణ చేయకుండా నిర్లక్ష్యంగ మాట్లాడుతూ డబ్బులు ఇస్తాను వైద్యం చేయించుకో అంటూ మాట్లాడడం సరైనది కాదన్నారు. నిన్న సాయత్రం నుండి ఈ సంఘటనపై విచారణ చేస్తున్నా ఆర్ ఐ ఓ గారు పేరుకు మాత్రమే విచారణ కాని కళాశాల యాజమాన్యానికి పూర్తి లొంగిపోయి. విచారణను నీరు కారుస్తున్నారు అని అన్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం బాధిత విద్యార్థి లేకుండా వారి తల్లిదండ్రులు లేకుండా కళాశాల ప్రిన్సిపాల్ లేకుండ ఎలా విచారణ చేస్తున్నారు అని విద్యార్థి,మహిళా సంఘంగా ప్రశ్నించారు. గతంలో కూడా ఎస్ఆర్ బాయ్స్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఇదే ఆర్ఐఓ విచారణ పేరుతో కాలయాపన చేశారు తప్ప ఆ కళాశాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ఎస్ఆర్ కళాశాల యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ ఆర్ఐఓ పదవికి మాయని మచ్చతేస్తున్నా గురవయ్య శెట్టిని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసు బనాయించి , కళాశాలను వెంటనే సీజ్ చేయించి విద్యార్థులకు రక్షణ కల్పించాలి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు శ్యామల సుజాత జయమ్మ ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ నగరం ఉపాధ్యక్షుడు నాయకులు పృథ్వి ఏఐఎస్ఎఫ్ నాయకులు శరత్ తదితరులు పాల్గొన్నారు