
సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హెచ్ఆర్పిసిఐ నేషనల్ చైర్మన్ ఆర్ కె. కంబగిరి స్వామి
కొలిమిగుండ్ల , న్యూస్ వెలుగు; సైబర్ నేరాలపై ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ సంస్థ నేషనల్ చైర్మన్ ఆర్ కె .కంబగిరి స్వామి అన్నారు అనంతరం ఆయన కొలిమిగుండ్ల హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ సంస్థ ప్రాంతీయ కార్యాలయం నందు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతు మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రైవేట్ యాప్స్ ద్వారా ఎటువంటి ఉపాధి లేని నేరగాళ్లు ప్రజలను డబ్బులు ఆశలు చూపిస్తూ ప్రజల సెల్ కు మెసేజ్లు పంపిస్తూ ఓటిపిలు ద్వారా ప్రజల ఖాతాల్లో ఉన్న డబ్బులను మోసపూరితంగా కాజేస్తున్నారని బ్యాంకు నుండి గాని ఫోన్ చేస్తున్నామని ఓటిపి చెప్పండి అంటూ ఎవరైనా అడిగితే ఓటిపిని చెప్పకూడదని వారితో చాకచక్యంగా వ్యవహరించాలని పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేస్తున్నామని కేసులు* పెడుతున్నామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే మీరు పోలీస్ స్టేషన్ కు మేము వస్తామని చకచక్యంగా తెలియజేయాలని ప్రజలను మోసం చేస్తూ ఆన్లైన్ గేమ్స్ యాప్స్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు అదేవిధంగా సైబర్ నేరాల ఊబిలో ప్రజలు పడకుండా సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి వారి* దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు అదేవిధంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ సంస్థ బృందాల ద్వారా త్వరలోనే సైబర్ నేరాలపై*ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar