
మహాత్ముని అడుగుజాడలలో నడవాలి
రాయలసీమ శకుంతల
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రతి ఒక్కరూ జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడలలో నడవాలని రాయలసీమ మహిళ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ మహిళ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ex ఎస్సీ
ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ రాయలసీమ శకుంతల అభిప్రాయ పడ్డారు. మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా గురువారం అశోక్ నగర్ లోని నిరాశ్రయా వసతి గృహం లో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా శకుంతల ప్రసంగింస్తూ మహాత్మా గాంధీ గారు అహింసావాది అని శాంతి, సహనం, ఓర్పు గలవారని బ్రిటీష్ పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సహనంతో భరించి చివరకు మనకు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారని అలాంటి మహనీయుల త్యాగాలను భారతజాతి ఎన్నటికీ మరువలేదన్నారు. కార్యక్రమంలో వసతి గృహ మేనేజర్ గోరంట్లలతా నిరాశ్రయ మహిళలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!