నగరపాలక కమిషనర్, నియోజకవర్గ నోడల్ అధికారి ఎస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నగరపాలక కమిషనర్, 

నోడల్ అధికారి ఎస్.రవీంద్ర బాబు అన్నారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ హైస్కూల్, మామిదాలపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కమిషనర్ పరిశీలించి, నమోదు ప్రక్రియను ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 117 ఉపసంహరణలో భాగంగా, విద్యార్థుల సంఖ్య బట్టి పాఠశాలల క్లస్టర్లుగా వర్గీకరణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కర్నూలు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను 10 క్లస్టర్లుగా విభజించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతి క్లస్టర్‌కి ఒక ప్రధానోపాధ్యాయులు ఉంటారని, ఎంఈఓలు ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎంఈఓ-2 విజయకుమారి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాల్గొన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!