
ఎన్టీఆర్ అవార్డు గ్రహీత బీసీ కృష్ణ ఇకలేరు
కర్నూలు, న్యూస్ వెలుగు;  సుప్రసిద్ధ రంగస్థలం కళాకారులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత బీసీ కృష్ణ ఇకలేరు. శనివారం  సాయంత్రం నాలుగు గంటలకు అనారోగ్య కారణాలవల్ల పరమపదించారు. వీరి వయస్సు 79 సంవత్సరములు. ఒక కుమారుడు. కర్నూల్ నగరం నందలి గౌలిగేరి నందు వీరి స్వగృహం, సత్యహరిచంద్ర పాత్ర, బిల్వ మంగళ పాత్ర, ఆయన సాటి లేని మేటి నటన, జిల్లాస్థాయి, రాయలసీమ స్థాయి, రాష్ట్రస్థాయి, అనేక అవార్డులు పొందినటువంటి కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు వీరు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈరోజు సాయంత్రం వారి స్వగృహం గౌరీ గేరి వీధి యందు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక వ్యవహారాల అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి, కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక సమన్వయకర్త, బైలుప్పల షఫీయుల్లా, కవి రచయిత డి పార్వతయ్య, వీరి పార్థివ దేహానికి పూలమాలలు అర్పించి కళామతల్లి ముద్దుబిడ్డ బిసి కృష్ణ గారికి ఘనంగా నివాళులు అర్పించారు…
ఇట్లు..
సమన్వయకర్త. 
బైలుప్పల షఫీయుల్లా.
కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక. 
కర్నూలు జిల్లా……..


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist