
జిల్లాలోని 2,39,332 పింఛనుదార్లకు రూ.102.89 కోట్ల రూపాయల పంపిణీ
లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఫిబ్రవరి మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 39 వేల 332 మంది
శనివారం ఉదయం దేవనకొండ మండలం కరివేముల గ్రామ సచివాలయ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కిడ్నీ వ్యాధిగ్రస్తులైన గుఱ్ఱం కిరణ్, గిరిధర్, వైకల్యం పెన్షన్ రాజగోపాల్, వృద్ధాప్య పెన్షన్ రంగన్న, వితంతువు పెన్షన్ జయమ్మ ల ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్ పెన్షన్ మొత్తాన్ని అందజేశారు…
ఈ సందర్భంగా కలెక్టర్ కిడ్నీ వ్యాధి గ్రస్తులైన గుఱ్ఱం కిరణ్, గిరిధర్ లకు పెన్షన్ అందచేస్తూ వారి బాగోగులు తెలుసుకున్నారు.. ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకుంటున్నారు? వారంలో ఎన్ని సార్లు చేయించుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ కింద చేయించుకుంటున్నారా? అని కిరణ్, గిరిధర్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.. గౌరీ గోపాల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నామని, వారంలో మూడు లేదా నాలుగు సార్లు ట్రీట్మెంట్ చేయించుకునేందుకు వెళ్తామని, ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చేస్తున్నారని కలెక్టర్ కు కిడ్నీ వ్యాధి గ్రస్తులైన గుఱ్ఱం కిరణ్, గిరిధర్ లు వివరించారు..
అలాగే వైకల్యం పెన్షన్ రాజగోపాల్, వితంతువు పెన్షన్ జయమ్మ లకు పెన్షన్ అందచేస్తూ పెన్షన్ ప్రతినెల ఒకటో తారీకుకి సమయానికి పెన్షన్ అందిస్తున్నారా?అని కలెక్టర్ ఆరా తీశారు.
అనంతరం కరివేముల గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు తో మాట్లాడుతూ వ్యవసాయం గురించి ఆరా తీశారు..ఇక్కడ ప్రధానంగా ఏ పంటలు పండిస్తారు, సమస్యలు ఏమి ఉన్నాయని కలెక్టర్ సర్పంచ్ ని అడిగి తెలుసుకున్నారు…
సచివాలయ భవన నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని, గ్రామానికి లక్ష లీటర్ల సామర్థ్యం తో కూడిన ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలని, గ్రామంలో కొత్త కాలనీలు ఉన్నాయని, వాటికి సిసి రోడ్లు కావాలని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా, సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు..
కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్, డిఆర్డిఎ పిడి శివ నాగలీల తదితరులు పాల్గొన్నారు..