
ఉచిత కంటి వైద్య శిబిరం
కంటి సమస్యలను నిర్లక్ష్యం వహిస్తే జీవితాంతం అంధకారంతో జీవించవలసి వస్తుంది -డాక్టర్ జయప్రకాష్, లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్
కర్నూలు, న్యూస్ వెలుగు; బాల సాయి కంటి ఆసుపత్రి,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ,సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మరియు నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా షరీన్ నగర్ ప్రజలకు ఉచిత కంటి మరియు ఉచిత బిపి షుగర్ పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించాయి.ఈ సందర్భంగా **లయన్ డా. రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, “స్వచ్ఛమైన చూపు ప్రతి మనిషికి హక్కు. సామాన్య ప్రజలకు అందుబాటులో కంటి వైద్యాన్ని తీసుకురావడమే మా లక్ష్యం”అన్నారు. శిబిరంలో నిపుణులైన కంటి వైద్యులు డాక్టర్ జయప్రకాష్ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్ళజోడు పంపిణీ చేశారు. డాక్టర్ ఇఫ్తెకర్ అహ్మద్ బి.పి షుగర్ పరీక్షలను నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ కంటి సంబంధిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.ముఖ్యంగా గ్లాకోమా, మయోపియా, క్యాటరాక్ట్ (ముత్యాల కంటి) వంటి సమస్యల పై అవగాహన కల్పించారు. అవసరమైనవారికి శస్త్రచికిత్సల ఏర్పాట్లు కూడా చేయబడతాయన్నారు.వైద్య శిబిరంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నాగరాజు, రవి ప్రకాష్, ల్యాబ్ టెక్నీషియన్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist