భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్

భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్

పత్తికొండ, న్యూస్ వెలుగు;  మండలంలోని  హోసూర్ గ్రామంలో భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ . రథోత్సవం సందర్భంగా గ్రామ టీడీపి నాయకులు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కి ఘన స్వాగతం పలికారు. ముందుగా భద్రకాళి వీరభద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు మంత్రం చరణాల మంగళ వాయిద్యాలు భక్తుల హర్షద్వానాల మధ్య భద్రకాళి వీరభద్ర స్వామి మహా రథోత్సవానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ముందుకు లాగారు.మహారథం ముందుకు సాగుతుండగా నందికోల నృత్యాలు, కోలాటాలు, ప్రత్యేక నృత్యాల వేషాధారణలు, బొమ్మల ప్రదర్శ నలు మంగళవాయిధ్యాలు, బీరప్పడోళ్లు, తప్పెట్లతో మహారథానికి స్వాగతం పలికారు. రథం ముందుకు సాగుతుండగా.. భక్తులు గోవిందా గోవిందా, హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు జయధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమం లో బత్తిన వెంకట్రాముడు ,సాంబశివరెడ్డి , తుగ్గలి నాగేంద్ర  ఇతర ముఖ్య నాయకులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!