
హాస్టల్ విద్యార్థులకు క్రీడా వస్తువులు పంపిణి
విద్యార్థులకు అందజేసిన పాఠశాల హెడ్మాస్టర్ నరేంద్ర,పిజికల్ డైరెక్టర్ పాండురంగరాజు.
విద్యార్థులకు విద్యాతో పాటు క్రీడలు అవసరం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుంకన్న.
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని ప్రతి సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థుల కోసం టవల్స్ మరియు శారీరక వ్యాయామం కోసం ఆటలు ఆడుకోవడానికి కావాల్సిన క్రీడా వస్తువులైన టెన్నికాయిట్ రింగ్స్ 10,
షటిల్ బ్యాడ్మింటన్ బ్యాట్స్ 4,చెస్ బోర్డ్స్ 5,క్యారమ్ బోర్డ్స్4,షార్టుపుట్, జావెలిన్ త్రో కర్ర,వాలీబాల్ 2,డిస్క్ త్రో వంటి క్రీడా పరికరాలను తుగ్గలి మండలం పరిధిలోని పెండేకల్ ఆర్.ఎస్ రైల్వే స్టేషన్లోని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు ప్రభుత్వ బాలుర వసతి గృహ సంక్షేమ అధికారి పి. సుంకన్న ఆధ్వర్యంలో బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు కె. నరేంద్ర ప్రసాద్,పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పాండురంగరాజు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు హాస్టల్ విద్యార్థులకు క్రీడలకు సంబంధించిన క్రీడా పరికరాలను అందజేశారు.ఈ సందర్బంగా ప్రభుత్వ బాలుర వసతి గృహం అధికారి సుంకన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ లోని విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల మానషిక శరీరక మానషిక వికాస ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు క్రీడా కిట్లను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు పంపడం వాటిని విద్యార్థులకు మేము అందజేయడం సంతోషంగా ఉన్నదని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి వారి మానషిక శారీరక వికాషానికి మంచి పునాది వేసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో హై స్కూల్ హాస్టల్ సిబ్బంది మనోహర్,ఆనంద్, బాలస్వామి,హాస్టల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.