
ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కె శ్రీనివాసులు అభినందనలు
కర్నూలు, న్యూస్ వెలుగు; శ్రీకాకుళంలో ఫిబ్రవరి 6 నుండి 8 వరకు జరిగిన ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభల్లో ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి కొంగర శ్రీనివాసులు ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర సమితి సభ్యులుగా బిసన్న లు ఎన్నికైన సందర్భంగా ఏఐవైఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక సిఆర్ భవన్ నందు శ్రీనివాసులు బిసన్న లకు పూలమల వేసి అభినందనలు తెలియజేశారు 
ఈ సందర్భంగా మాజీ ఏఐవైఎఫ్ నాయకులు సిపిఐ కర్నూలు నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక మంది యువకులు భారతదేశంలో ఉన్నారని యువశక్తితో దేశం అభివృద్ధి చెందుతుందని గొప్పలు చెప్పే పాలకులు యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఏఐవైఎఫ్ గా రాష్ట్ర నాయకులుగా ఎన్నికైన నాయకులు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, నిరుద్యోగులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాల కోసం సమరశీల పోరాటాలు కొనసాగించి యువత హక్కుల కోసం ముందుండి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ కర్నూల్ నగర సహాయ కార్యదర్శి సి మహేష్ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ , నగర అధ్యక్షులు నాగరాజు నగర ఆఫీస్ బేరర్స్ శ్రీకాంత్ ,అఖిల్ , రవి, కళాకర్ ,శివాజీ, రాజ్ కుమార్, విన్నీ, అద్భుత కుమార్ తదితరులు పాల్గొన్నారు


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar