
ఏపీలో వేసవి ముందే.. భగభగలు!
అమరావతి; ఏపీ రాష్ట్రంలో మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత ఎక్కువ అవుతున్నాయి. ఉదయం 11గంటల నుంచే ఎండ తీవ్రత అధికం అవుతోంది. ప్రజలు బయటకెళ్లాలంటే భయపడాల్సి వస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఎండ వేడికి అల్లాడుతున్నారు. గత మూడు రోజులుగా భానుడి భగభగలు జిల్లాలో పెరుగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే వీలుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM