
కృష్ణమ్మ పరవళ్లును ఆస్వాదించిన ముఖ్యమంత్రి
అమరావతి: విజయవాడలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని ఉండవల్లి వెళ్తూ సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగి బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. దీంతో పలువురు సందర్శకులు సీఎంతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణమ్మకు జలకళ రావడం చూసి ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu