
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీ నాయకులు
మైనార్టీ సంక్షేమానికి రూ.5 వేల 434 కోట్లు కేటాయింపు
హోళగుంద, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.5434/- కోట్ల రూపాయలు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హోళగుంద ముస్లిం మైనార్టీ నాయకులు శుక్రవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్,కృషి చేసిన మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్,ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ వీరభద్ర గౌడకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని మరోసారి రుజువైందన్నారు.ఇటీవలే మసీదులలో ఇమామ్,మౌజన్ లకు గౌరవ వేతనంతో పాటు మసీదుల నిర్వహణ కొరకు నిధులు కేటాయించడం మరియు ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.5434 కోట్లు నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు.ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని,3.22 లక్షల కోట్ల బడ్జెట్ తో ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు.అదేవిధంగా రైతుల కొరకు వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్ల నిధులు కేటాయించడం,ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ, దీపం పథకం,ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,మత్స్యకార భరోసా వంటి వివిధ ప్రజా సంక్షేమ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు.ముస్లింల సంక్షేమానికి ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించలేదని,ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు అబ్దుల్ సుభాన్,సిబిఎన్ ఆర్మీ మోయిన్,శాలి మెహబూబ్ బాష,వలి,ఇలియాస్, తన్వీర్,అబ్దుల్ రహిమాన్,హేసన్, అమన్, సలీం,ఇబాదుల్లా,సుభాన్,ఫరూక్, చిన్న హేట సర్పంచ్ హెసన్,జఫ్రుల్ల,దూదేకుల సంఘం నాయకులు పీరా సాబ్,బడేసాబ్,హుస్సేన్ పీరా,సాయిబేష్ తదితరులు పాల్గొన్నారు.