6 మంది విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాప్ లు అందచేసిన కలెక్టర్ 

 6 మంది విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాప్ లు అందచేసిన కలెక్టర్ 

కర్నూలు, న్యూస్ వెలుగు; పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న 6 మంది విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ల్యాప్ టాప్ లను అందచేశారు..
సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 6 ల్యాప్ టాప్ లను కలెక్టర్ విభిన్న ప్రతిభావంతులకు అందజేశారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చేసిన అర్హులైన విభిన్న ప్రతిభావంతుల కొరకు ల్యాప్ టాప్ లను మంజూరు చేస్తోందన్నారు.. ఒక్కొక్క ల్యాప్ టాప్ దాదాపుగా 58 వేల రూపాయలు ఉంటుందన్నారు…ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఉన్నత స్థానం చేరుకునేందుకు కృషి చేయాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు…
ఈ సందర్భంగా స్థానిక ప్రకాష్ నగర్ లో నివాసం ఉన్న హకీమ్, రేష్మా ల కుమారుడు ఉమర్ కి ట్రై సైకిల్ ఇప్పించాలని కలెక్టర్ గారికి అర్జీ సమర్పించగా.. కలెక్టర్ వెంటనే స్పందించి విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులతో మాట్లాడి తక్షణమే వీల్ చైర్ ఇప్పించారు..విభిన్న ప్రతిభావంతుల సౌకర్యార్థం అన్ని జిల్లా కార్యాలయాలో ర్యాంప్ లు ఏర్పాటు చేయాలని, డిపీఓ, డిఈఓ కార్యాలయాలలో మాత్రం ఇంకా ఏర్పాటు చేయలేదని, త్వరితగతిన ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు…
కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!