నగరపాలక కమిష నర్ యస్.రవీంద్ర బాబు
ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 17 అర్జీలు
నగరపాలక సంస్థ, కర్నూలు న్యూస్ వెలుగు; నగర పరిధిలో వివిధ కాలనీలకు సంబంధించి వచ్చే వినతులను సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం చేసుకొని, ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని

నగరపాలక సంస్థ కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 అర్జీలు రాగ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ అర్జీదారులకు హామీనిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ యన్.చిన్నరాముడు, ప్రజారోగ్యధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!