
కర్నూల్ జిల్లా లాక్కోస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ టౌన్ లోని ఆదర్శ పాఠశాలలో ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా లాక్రోస్ అసోసియేషన్ ఎన్నికల అధికారి జ్యోతి రాణి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో నూతన అధ్యక్షుడిగా డాక్టర్ బి.హరికిషన్, కార్యదర్శిగా ఎన్. వజ్రరాజు, కోశాధికారిగా ఎం. భరత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బి.ఎస్. ప్రవీణ్ కుమార్, ఆర్గనైజ్ సెక్రెటరీగా కే. శివ, జాయింట్ కార్యదర్శిలు బి. హుస్సేన్ సాబ్, టి. లావణ్య ఈసీ మెంబర్లుగా కె. నబి రసూల్, దివాన్ సాహెబ్, టి. మధు కృష్ణ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీ నూతన ఎన్నికైన ఆధ్వర్యంలో 2025 నుండి 2029 వరకు సభ్యులుగా వ్యవహరిస్తారు. రాబోయే సంవత్సరంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కోచింగ్ క్యాంపు లను జిల్లా నలుమూలలో నిర్వహిస్తామని నూతన అధ్యక్షులు డాక్టర్ బి హరి కిషన్ తెలిపారు. కార్యదర్శి వజ్రరాజు మాట్లాడుతూ మన కర్నూలు జిల్లా నుంచి డి.బెలగల్ కు చెందిన బి.హుస్సేన్ సాబ్, గోనెగండ్ల మండలం నుండి కీర్తి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులను సన్మానించారు. వీరు కర్నూలు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినందుకు కర్నూలు జిల్లా లాక్కోస్ అసోసియేషన్ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర లాక్కోస్ అసోసియేషన్ అబ్జర్వర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సురేంద్ర రెడ్డి మరియు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ ఎం. అవినాష్ జాయింట్ సెక్రెటరీ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ నుంచి హాజరయ్యారు. ఈ ఎన్నికలకు వివిధ మండలాల నుంచి 54 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరి, అమరేష్, మల్లికార్జున, శ్రీను, తదితరులు హాజరయ్యారు.