
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి
2024-25 అకడమిక్ సంబంధించి అడ్మిషన్లు నిర్వహించాలి : ఐసా రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగరాజు జిల్లా కార్యదర్శి స్వామిదాసు నాగార్జున
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో డా.బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కేంద్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ ముందు విద్యార్థులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐసా రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగరాజు ,ఐసా జిల్లా కార్యదర్శి స్వామిదాసుగారి నాగార్జున మాట్లాడుతూ…దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం 1982 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని తర్వాత 1991 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రభుత్వం మార్చడం జరిగిందని రాష్ట్ర విభజన అనంతరం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి గా కొనసాగించారని రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికి రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ ఏర్పాటు చేయలేకపోయాకపోవడం సిగ్గు చేటని. 2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లోని 76 కేంద్రాలలో అడ్మిషన్లను నిలిపివేయడం దారుణమని . ఈ చర్యతో ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు మరియు సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందిగా ఐసా గా డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో విద్యార్థులను,విద్యార్థి యువజన సంఘాల నాయకులను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు పెద్దయ్య, నాని,సతీష్ తదితరులు పాల్గొన్నారు.