పశ్చిమ గోదావరి జిల్లా న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నాలుగు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా ‘ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నిషేధం-పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే ఇతివృత్తంతో నిర్వహించే కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులతో ఆయన సమావేశం అవుతారు. తర్వాత నియోజకవర్గానికి చెందిన సుమారు రెండు వేల మంది ప్రజలతో ముఖ్యమంత్రి ప్రజా వేదిక నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేస్తారని ఆయా పార్టీ నేతలు వెల్లడించారు . జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.
Thanks for your feedback!