మంగళగిరి న్యూస్ వెలుగు: స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని ఎకో పార్కును సందర్శించారు.

పార్కులోని చెత్తను ఆయన ఊడుస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచారు. చంద్రబాబు గతంలో చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారని వాటి ద్వారా సంపద సృష్టించవచ్చని తెలిపారు. గత ప్రభుత్వం సంపద సృష్టి కేంద్రాలను విస్మరించి శిథిలావస్థకు తీసుకొచ్చే పరిస్థితికి తెచ్చిందన్నారు. ఎకో పార్కులో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులతో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు, చెత్త ఊడ్చేందుకు కావలసిన పరికరాలు, వారి సమస్యలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. చెత్తను రోడ్లపై పారవేయకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన ప్రజకు పిలుపునిచ్చారు.
Thanks for your feedback!