తణుకు న్యూస్ వెలుగు : 

“స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తణుకులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అక్టోబర్ 2 నాటికి, తణుకు పట్టణంలో 42 పార్కులు పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!