
వైయస్సార్సీపి మండల ప్రధాన కార్యదర్శిగా చెన్నంపల్లి రంజాన్ వలి
తుగ్గలి వెలుగు న్యూస్ ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు రంజాన్ వలిను వైఎస్ఆర్సిపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్సిపి కేంద్ర కమిటీ ఎన్నిక చేసింది.ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శిగా తనను ఎంపిక చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు,మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కు, మండల వైఎస్సార్సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొని పార్టీ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పై మండల కమిటీ సహకారంతో ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలియజేశారు.త్వరలో రాబోయే పంచాయితీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని వైయస్సార్సీపి తుగ్గలి మండల ప్రధాన కార్యదర్శి రంజాన్ వలీ తెలియజేశారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu