
పత్తికొండ నియోజకవర్గ సమకాలిక సమస్యలపైన గళం వినిపించండి
పత్తికొండ కు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ
పత్తికొండ కు కావాల్సింది అభివృద్ధి మరియు సాధికారత, రాజీకీయం కాదు
పత్తికొండ నియోజకవర్గ ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు
– *పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ
పత్తికొండ /తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటికైనా టమోటా ప్రాసెసింగ్ యూనిట్ పనులు మొదలు పెట్టడం సంతోషం కానీ అసలు ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలియాల్సి ఉంది అని ఇంచార్జి క్రాంతి నాయుడు అన్నారు. టిడిపి హయాంలో అప్పటి నాయకులు అస్సలు ఇక్కడ టమోటా జ్యూస్ కి పనికి రాదు మీరు అడగకూడదు అని అన్నారు మన రైతులను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వారు కూడా టమోటా రైతులు నష్టపోతున్నారు అని విన్నవించినా ముందుకు రాలేదు అని అన్నారు. అప్పుడు మేము మాకు సహకరించండి మేము ఇక్కడ టమోటా జ్యూస్ కి పనికి రాకపోయినా బ్రిక్స్ రిపోర్ట్ తీసుకున్నాము ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయొచ్చు మాకు ప్రభుత్వం సహకరించండి అని అడిగి మొట్టమొదట సారిగా డీపీఆర్ మొదలగు రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేస్తే కేంద్రం నుండి నిధులు వచ్చాయి తప్ప పోయిన ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయొచ్చు అని మొదట ప్రస్తావించి కృషి చేసింది మేము అని అన్నారు. మీకు నిజంగా మన ప్రజలపైన ప్రేమ ఉంటే ఆల్రెడీ శాంక్షన్ అయిన వాటిని కాకుండా మీరు కొత్తగా ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ ను లేక మీట్ (మాంసం) ప్రాసెసింగ్ యూనిట్ ను ఇక్కడికి తీసుకురండి అని అంతే కానీ ప్రజలను మోసం చేయకండి అని అన్నారు. పోయిన ఎమ్మెల్యే ని పత్తికొండ కోసం గళం వినిపించండి అని కొన్ని సమస్యలు చెప్పాము వారు వినలేదు, ఇప్పటి ఎమ్మెల్యే యువకులు సమస్యలపైన గళం వినిపించండి అంటే కంప్లయింట్ చేస్తున్నారు అని అన్నారు. అసలు పత్తికొండ కు ఏమి కావాలి అనేది మన నాయకులకు తెలుసా అని అడుగుతున్నాం అని అన్నారు, ఇక్కడ ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఉంటే అవి పట్టించుకోకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారు అని అన్నారు. ఇక్కడ ప్రజలకు అభివృద్ధి మరియు సాధికారత కావాలి అని ఏరియా ఆసుపత్రి, బాలికల బీసీ హాస్టల్, వృత్తి విద్యా కోర్సులు, రోడ్ల వెడల్పు, పిల్లకాలువల ద్వారా చెరువులు నింపడం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లేక ఇంజనీరింగ్ కళాశాల, అసెంబ్ల్డ్ ఇండస్ట్రీస్ వంటి పైన దృష్టి పెట్టాలి అని ఇక్కడ రిజర్వాయర్, రవాణా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన గళం వినిపించాలి అని కోరారు. అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కనుక కొంచం మనుసు తో ఆలోచన చేసి కృషి చేయాలి అని కోరారు లేని పక్షంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని అని తెలియజేశారు.