మీ ఇంటివద్దే పన్నులు చెల్లించొచ్చు : కమిషనర్ రవీంద్ర బాబు

మీ ఇంటివద్దే పన్నులు చెల్లించొచ్చు : కమిషనర్ రవీంద్ర బాబు

న్యూస్ వెలుగు కర్నూలు : నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలను ప్రజలు సులువుగా చెల్లించేందుకు నగరంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రవీంద్ర బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, ఇప్పటికే క్షేత్రస్థాయిలో సిబ్బంది విస్తృతంగా తిరుగుతూ, పన్ను వసూళ్లను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. నగరపాలక కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పన్ను వసూలు కేంద్రాలు ఆదివారం సైతం తెరిచే ఉంటాయని, ప్రత్యేక కౌంటర్లలో ఉదయం 7 నుండి రాత్రి 7 లోపు ప్రజలు తమ పన్నులను చెల్లించవచ్చన్నారు. అదేవిధంగా ప్రజలు ఇంటి నుంచే డిజిటల్ ప్లాట్‌ఫాంలలో పన్నులను చెల్లించవచ్చని, వాట్సాప్ నెంబర్ 9552300009, పురసేవ యాప్, వెబ్‌సైట్ https://cdma.ap.gov.in/en/ptpayments లలో ఏదైనా ఒక పద్దతిలో పన్నులను చెల్లించవచ్చని కమిషనర్ సూచించారు. ఒకవేళ నగదు రూపంలో చెల్లించాలనుకుంటే స్థానిక సచివాలయం, మీ సేవ, ఆన్‌లైన్ కేంద్రాలు, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలలో లేదా నగరపాలక సంస్థ కార్యాలయంలో పన్నులు చెల్లించవచ్చని సూచించారు.

ప్రత్యేక కౌంటర్లు ఇక్కడే:
1. కల్లూరు వార్డు కార్యాలయం – 85వ సచివాలయం
2. జె.యన్.ఆర్. నగర్ (సి.క్యాంపు) – 62వ సచివాలయం
3. బాలాజీ నగర్ – 104వ సచివాలయం
ప్రజా సంబంధాల అధికారి కర్నూలు నగరపాలక సంస్థ.

Authors

Was this helpful?

Thanks for your feedback!