
50% వడ్డీ రాయితీకి విశేష స్పందన
* నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ వెల్లడి
* రెండు రోజుల్లో రూ.3.80 కోట్లు పన్ను వసూళ్లు
* వడ్డీ రాయితీ వినియోగానికి మిగిలింది మూడు రోజులే
* శివారు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు
నగరపాలక సంస్థ; కర్నూలు న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై వన్‌టైమ్ సెటిల్మెంట్‌కు కల్పించిన 50% వడ్డీ రాయితీ అవకాశానికి నగర ప్రజలు పెద్దసంఖ్యలో సద్వినియోగం చేసుకుంటున్నారని, గడిచిన రెండు రోజులుగా నగర ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆస్తి పన్ను మొత్తం రూ.66.39 కోట్లు వసూలు అవ్వగా, కేవలం బుధ, గురువారాల్లో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు, తాగునీటి కొళాయి చార్జీలు రూ.4 కోట్లు వసూలు అయిందన్నారు. జనవరి 19 నుండి మార్చి 24 వరకు విసృతంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ.15.58 కోట్లు వసూలు చేశామని, 50% రాయితీ రెండు రెండు రోజుల్లో రూ.3.80 కోట్లు వసూలు అవ్వడం సరికొత్త రికార్డు నమోదు చేసిందన్నారు. నగరాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రజల బాధ్యతాయుతం అభినందనీయమన్నారు. పన్ను చెల్లింపునకు ప్రజలు నగరపాలక కార్యాలయానికే కాకుండా ఇంటి నుంచైనా చెల్లించవచ్చని, స్థానిక సచివాలయం, ప్రత్యేక కౌంటర్లు, మీ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో సైతం పన్నులను చెల్లించవచ్చని అదనపు కమిషనర్ సూచించారు.