ఆర్ఐఓ ను సస్పెండ్ చేయాలి:AISF

ఆర్ఐఓ ను సస్పెండ్ చేయాలి:AISF

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఏఐఎస్ఎఫ్ నాయకులను దుర్భాషలాడం సిగ్గుచేటు

ఆర్ఐఓ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు.

ఆర్ఐఓ ను తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం

ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ భాష

కలెక్టరేట్ : కర్నూలు న్యూస్ వెలుగు; అవినీతి,ఆక్రమాలకు పాల్పడుతున్న ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి, ఆర్ఐఓ గురువయ్య శెట్టిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి. సోమన్న, ఎస్. షాబీర్ భాష డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారుఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ భాష మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ప్రైవేట్,కార్పొరేట్ కళాశాలలు అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అన్నారు అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రంగురంగుల కరపత్రాలు, భారీ హోర్డింగ్ లు పెట్టి ప్రచారాలు,ప్రసారాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని, అడ్మిషన్ ముందు ఒక ఫీజు, అడ్మిషన్ తర్వాత ఇంకొక ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటినీ అరికట్టాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారి, ఆర్ఐఓ నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరిస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి, వాటి వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉందని అన్నారు. గురువయ్య శెట్టి ఆర్ఐవో బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు .కావున ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు స్పందించి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఆర్ఐఓ ను సస్పెండ్ చేసి, ఆయన అవినీతి అక్రమాలపై సిబిఐ,సిఐడి లతో విచారణ జరిపించి, ప్రైవేట్,కార్పొరేట్ కళాశాలల ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని, ఫీజుల దోపిడీని నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని,హెచ్చరించారు.అనంతరం ఆర్ఐఓ గురువయ్య శెట్టి దిష్టిబొమ్మ దహనం చేస్తుండడంతో పోలీసులు అడ్డగించి, ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసి, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరు ఆర్ ఐ ఓ తొత్తుగా మారిన పోలీస్ యంత్రాంగం నశించాలని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులపై మీ పోలీసుల ప్రతాపం చూపించడం కాదు, జిల్లాలో కర్ణాటక మద్యం ఏరులై పారుతుంది, గుట్కా మరియు మట్కా, క్రికెట్ బెట్టింగ్స్ చేసేటి వాళ్ళపైన మీ ప్రతాపం చూపించండి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్
గర్ల్స్ కన్వీనర్ అక్షర జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్ కుమార్, నగర అధ్యక్ష,కార్యదర్శులు అభి,అశోక్, నాయకులు ముని,నాని,శ్రీను, వీరెష్, మోహన్, కుమార్, వరుణ్, సందీప్, రాము, తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!