చేనేతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి
అంబేద్కర్ కోనసీమ జిల్లా: జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ద్వారా గుర్తించబడిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆధునిక చేనేత యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి వాసం శెట్టి సుభాష్ తెలిపారు. చేనేత, జౌళి రంగ అభివృద్ధికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయని అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేనేత కార్మికులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుందని వారు మీడియాకు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!