
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గించాలి
వైసిపీ జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్.
తుగ్గలి న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని వైఎస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్ తెలియజేశారు. శనివారం రోజున ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలపై ఎటువంటి చార్జీలు పెంచబోమని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను వదిలేసి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పెంచడం బాధాకరమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పింది ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్నది మరొకటని,రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు విద్యుత్ చార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమనీ చెప్పి సాదారణ విద్యుత్ చార్జీల కంటే సర్ చార్జీలు పెంచి ప్రజల నుంచి అధిక చార్జీలు వసూలు చేయడం సరికాదని కర్నూల్ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపును తగ్గించి రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu