
రైల్వేస్టేషన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
KURNOOL NEWS VELUGU
కర్నూలు న్యూస్ వెలుగు : భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కులకు మార్గదర్శకుడు, డా . బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నౌషాద్ ఆధ్వర్యంలో కర్నూలు రైల్వేస్టేషన్ లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి న రైల్వేస్టేషన్ మాస్టర్ శేషు, రైల్వే పోలీస్ ఫోర్స్ సి. ఐ వి. రామమోహన్, స్. ఐ ప్రేమ కుమార్, ఏ.స్ ఐ రమేష్ రెడ్డి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నౌషాద్ మాట్లాడుతూ చిన్న తనం నుండే కుల వ్యవస్థను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను అభ్యసించి ఒక ప్రముఖ భారతీయ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్త గా ఎదిగారని, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని, విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా అతి పెద్ద ప్రజస్వామ్య భారత రాజ్యాంగo ను తన ఆద్వర్యంలో రచించి దిశ నిర్దేశం చేశారని, స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి నేటి యువతకు అదర్శంగా నిలిచిన మహానీయుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కామర్షియల్ ఆఫీసర్ షాషా వలి, ఆటో యూనియన్ నాయకులు శ్రీను, నరసింహ రెడ్డి నగర్ యువకులు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.