ఆలూరు న్యూస్ వెలుగు :

ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చిప్పగిరి లక్ష్మీ నారాయణ హత్య పిరికిపంద చర్య అని కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష తెలియజేశారు. ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జిలాని భాష మాట్లాడుతూ లక్ష్మీనారాయణ హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నామని షేక్ జిలాని భాష తెలియజేసారు.
Thanks for your feedback!