రాయలసీమను మోసం చేస్తున్న బీజేపీ: అడ్వొకేట్ క్రాంతి నాయుడు

రాయలసీమను మోసం చేస్తున్న బీజేపీ: అడ్వొకేట్ క్రాంతి నాయుడు

న్యూస్ వెలుగు పత్తికొండ :

స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే తీవ్రమైన ప్రజా ఉద్యమాలు ఎదురవుతాయని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి మండలి తక్షణం ఏర్పాటు చేయాలి అని, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రాయలసీమలో స్థాపించాలి అని, పరిశ్రమలు, విద్యా సంస్థలు, కేంద్ర ప్రాజెక్టులను సీమకు మంజూరు చేయాలి అని, నీటి ప్రాజెక్టులపై శాశ్వత పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ తక్కువ కాలవ్యవధిలో తీసుకురావాలి అని అన్నారు. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాయలసీమ అభివృద్ధికి గణనీయమైన నిధులు మంజూరు చేయాలి అని, ప్రధాని మోదీ గారు రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి, కడప ఉక్కు పరిశ్రమకు ఒక్కసారి కూడా శంకుస్థాపన చేయలేదు అని అన్నారు. ఇదే ఆయనే అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఇది రాయలసీమ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ద్వంద్వవ్యతితి అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ‘రాయలసీమ ముఖ్యమంత్రి’గా ఉన్నా, ఆయన పాలనలోనే కేంద్ర సంస్థలు సీమ నుంచి అమరావతికి తరలించబడ్డాయి. మిషన్ రాయలసీమ, రాయలసీమ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అంతరించిపోయాయి. జనసేన నాయకులు కూడా ‘రాయలసీమ న్యాయం’ గురించి మాట్లాడకుండా, అమరావతి కోసం మాత్రమే మిగిలిపోయారు. ఇది వారి తలంపుల దురాశను స్పష్టంగా చూపుతోంది. అమరావతి పేరుతో జరుగుతున్న అభివృద్ధి కేంద్రీకరణను తీవ్రంగా ఖండిస్తున్నాము. కర్నూలు మొదట రాజధాని కోల్పోయి, శ్రీశైలం, గండికోట, ఇతర ప్రాజెక్టుల నిమిత్తం నేల నదుల్ని త్యాగం చేసిన సీమ రైతులకు పునరావాసం లభించలేదు అని వాపోయారు. అమరావతి రైతుల త్యాగాన్ని గొప్పగా చెబుతున్న నాయకులు, సీమ రైతుల బాధను ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. పత్తికొండ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కర్నూలు, రాయలసీమపై తమ స్పష్టమైన అభిప్రాయాన్ని తక్షణం ప్రకటించాలి అని లేదా మీరు చేస్తున్నది మోసం అని ప్రజలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అని అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!