కోటి రూపాయల చెక్కును సీఎం కు అందజేత

కోటి రూపాయల చెక్కును సీఎం కు అందజేత

అమరావతి : ఆఘస్ట్  15 నుండి ప్రారంభం కానున్న అన్నక్యాంటీన్లకు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు . ఆ సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరాజు మంగళవారం  సచివాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కును ఇవ్వడమే కాకుండా రాబోయే ఐదేళ్ల పాటు ఇంతే మొత్తం లో విరాళం అందిస్తానని తెలపడం హర్షణీయమన్నారు.
Image
ఈ సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందిచినట్లు సిఎం పేర్కొన్నారు.  పేద వాడికి అన్నంపెట్టే మంచి కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తున్నామని తెలిసి అన్ని వర్గాల వారూ అందులో భాగస్వాములు అవుతుండడం ఆనందంగా ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. తమకు ఉన్నదాంట్లో కొంత సమాజం కోసం ఖర్చు చేయాలనే వారి ఆలోచనలు అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని వారు కొనియాడరు.

Author

Was this helpful?

Thanks for your feedback!